Dhurandhar2 | ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న ‘ధురంధర్ 2’ చిత్రం ఇప్పుడు సెన్సార్షిప్ విధానాలపై సరికొత్త చర్చకు దారితీసింది. ఈ చిత్రంలో ఉపయోగించిన అసభ్యకర పదాలను సెన్సార్ బోర్డ్ (CBFC) పాక్షికంగా మ్యూట్ చేయడంపై నటుడు, బాలీవుడ్ దర్శకుడు దీపక్ తిజోరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన ఆయన, థియేటర్లలో కొన్ని బూతు పదాలను సగం మ్యూట్ చేసి, మరికొన్నింటిని పూర్తిగా తొలగించడంలోని సెన్సార్ లాజిక్ ఏంటో తనకు అర్థం కావడం లేదని విమర్శించారు. ఇప్పటికే ఈ చిత్రానికి ‘A’ (Adults Only) సర్టిఫికేట్ ఇచ్చారని, అంటే ఇది కేవలం పెద్దల కోసమేనని స్పష్టమవుతున్నప్పుడు, ఇలాంటి కోతలు ఎవరిని రక్షించడానికి అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా థియేటర్లలో సెన్సార్ చేసిన దృశ్యాలే, కొన్ని రోజుల తర్వాత ఓటీటీ వేదికల్లో ఎటువంటి కోతలు లేకుండా ‘అన్‌కట్’ వెర్షన్‌తో అందుబాటులోకి వస్తున్నాయని, ఈ ద్వంద్వ విధానం వల్ల సెన్సార్ బోర్డ్ ఉద్దేశమేంటో అర్థం కావడం లేదని ఆయన ఎండగట్టారు.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ మరియు సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు సెన్సార్ బోర్డ్ మొత్తం 21 మార్పులు సూచించింది. ఇందులో తల నరకడం వంటి అత్యంత హింసాత్మక దృశ్యాల నిడివిని తగ్గించడంతో పాటు, నోట్ల రద్దుకు సంబంధించిన సబ్‌టైటిల్స్ మార్చడం, ఇన్ఫర్మేషనల్ టెక్స్ట్‌లో ‘లాహోర్’ స్థానంలో ‘ఢిల్లీ’ అని చేర్చడం వంటి మార్పులు ఉన్నాయి. ఈ మార్పుల తర్వాత 3 గంటల 49 నిమిషాల నిడివితో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.