ప్రముఖ దర్శక, నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘7డేస్ 6నైట్స్’. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తూ రజనీకాంత్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెహర్ చాహల్ నాయిక. నిర్మాణానంతర పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దర్శకుడు ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ ‘యూత్‌ఫుల్ కంటెంట్‌తో.. యూత్‌కు నచ్చే అంశాలతో రూపొందిస్తున్న చిత్రమిది.
ఏడు రోజుల్లో కొందరు యువతీయువకుల జీవితాల్లో ఏం జరిగిందన్నది ఆసక్తిని పంచుతుంది. కొత్త కథలతో ప్రేక్షకుల్ని అలరించాలన్న లక్ష్యంతో ఇలాంటి చిత్రాలు తెరకెక్కిస్తున్నాను. ఈ చిత్రం తప్పకుండా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కో-ప్రాడ్యూసర్స్: జె.శ్రీనివాస రాజు, మంతెన రాము.