David Warner| ఎట్టకేలకి తెలుగు సినిమా తెరపై మెరవబోతున్న డేవిడ్ వార్నర్.. ఏ పాత్రలో అంటే..!
David Warner| ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన క్రికెట్‌తోనే కాదు తన రీల్స్‌తో కూడా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు
David Warner| ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన క్రికెట్‌తోనే కాదు తన రీల్స్‌తో కూడా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ తరచుగా సోషల్ మీడియాలో తెలుగు హీరోల డైలాగులు చెబుతూ రీల్స్ చేయడం మనం చూసాం. బాహుబలి, పుష్ప, డీజే టిల్లు అంటూ పలువురు టాలీవుడ్ సినిమా హీరోల స్టైల్‌ను అనుకరిస్తూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశాడు. ఈ క్రమంలో తెలుగు అభిమానులు వార్నర్ ని డేవిడ్ మామ అని ముద్దుగా పిలుచుకుంటూ వస్తున్నారు. అయితే ఆయన మన తెలుగు సినిమాలో తళుక్కున మెరిసిన బాగుంటుందని కొందరు తమ కోరికని వెళ్లబుచ్చారు.
అభిమానుల కోరిక నెరవేరింది. ఇప్పుడు డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలో కనిపించి సందడి చేయబోతున్నాడు. హీరో నితిన్ నటించిన రాబిన్‌హుడ్‌లో డేవిడ్ కనిపిస్తాడని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగిన దానిని ఎవరు ఖండించలేదు, నిజం చేయలేదు. ఇప్పుడా ప్రచారాన్ని నిజం చేస్తూ నిర్మాత రవిశంకర్ అభిమానులకి అదిరిపోయే శుభవార్త అందించారు. ‘కింగ్స్టన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత రవి శంకర్.. రాబిన్‌హుడ్‌లో వార్నర్ అతిథి పాత్ర పోషించినట్టు చెప్పి ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించారు. అయితే వార్నర్‌ది చిన్న పాత్రే అని చెప్పిన ఆయన ఏ పాత్రలో కనిపిస్తాడనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు.
డేవిడ్ వార్నర్ లాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్ తమ చిత్రం ద్వారా ఇండియన్ సినిమాకి, తెలుగు సినిమాకి పరిచయం అవుతుండడం తమకి ఎంతో సంతోషాన్ని ఇస్తుందని రవిశంకర్ అన్నారు. అలానే ఈ సినిమాలో నితిన్, శ్రీలీల చాలా అందంగా కనిపిస్తారని కూడా తెలియజేశారు. నితిన్, శ్రీలీల లాంటి పెయిర్ ని చూసి ఎన్నో ఏళ్లు అవుతుంది. గతంలో ఇలాంటి పెయిర్ ని పోకిరి చిత్రంలోనే చూశాను. ఆ మూవీలో మహేష్ బాబు, ఇలియానా ఎంత అందంగా కనిపించారో ఇప్పుడు మూవీలో నితిన్, శ్రీలీల అంతకి మించి అందంగా కనిపిస్తారు అని రవిశంకర్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

