విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నా
దర్శకుడు వెంకీ నాకు దేవుడిచ్చిన తమ్ముడు. నామీద తనకున్న ప్రేమ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమా రేపు విజయం సాధిస్తే.. ఆ క్రెడిట్ పూర్తిగా వెంకీ కుడుములదే. డేవిడ్ వార్నర్సార్ ఈ సినిమా చేయడం వల్ల సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి పెరిగింది.
‘దర్శకుడు వెంకీ నాకు దేవుడిచ్చిన తమ్ముడు. నామీద తనకున్న ప్రేమ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమా రేపు విజయం సాధిస్తే.. ఆ క్రెడిట్ పూర్తిగా వెంకీ కుడుములదే. డేవిడ్ వార్నర్సార్ ఈ సినిమా చేయడం వల్ల సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి పెరిగింది. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నా.’ అని హీరో నితిన్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల కథానాయిక. వెంకీ కుడుముల దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథి పాత్ర పోషించడం విశేషం. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్ మాట్లాడారు. ‘నన్ను ఓన్ చేసుకొని నాతో నటింపజేసిన టీమ్‌కి థ్యాంక్స్ చెబుతున్నాను. మంచి మనుషులు కలయిక ఈ సినిమా.’ అని డేవిడ్ వార్నర్ అన్నారు. అనుకోకుండా చేసిన సినిమా.. అనుకున్న దానికంటే బాగా చేసిన సినిమా ‘రాబిన్ హుడ్’ అని శ్రీలీల చెప్పారు. ‘ఈ సినిమా ఇంతబాగా రావడానికి కారణం నితిన్. అద్భుతమైన టీమ్‌ని నాకిచ్చి ముందుకు నడిపించిన నిర్మాతలకు థ్యాంక్స్. డేవిడ్ వార్నర్ సార్ చేయడం వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయి.’ అని డైరెక్టర్ వెంకీ కుడుముల పేర్కొన్నారు. డా.రాజేంద్రప్రసాద్, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌కుమార్, నటి కేతిక, రాహుల్ సంకృత్యన్, వివేక ఆత్రేయ, సాయిరాజేష్, కాసర్ల శ్యామ్, దేవ్ దత్, మైత్రీ శశి, హరి తుమ్మల, ప్రశాంత్ పిన్నమనేని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

