Das Ka Dhamki Movie | అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న దాస్ కా ధమ్కీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Das Ka Dhamki Movie On Ott | ఫలక్‌నూమా దాస్ తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని దాస్ కా ధమ్కీ సినిమాతో మళ్లీ మెగాఫోన్ పట్టాడు. గతనెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు నుంచి మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది.
Das Ka Dhamki Movie On Ott | నాలుగేళ్ల కిందట వచ్చిన ‘ఫలక్‌నూమా దాస్’తో దర్శకుడి అవతారమెత్తిన విశ్వక్.. తొలి సినిమాతోనే విషయం ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. కమర్షియల్గానూ ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నటుడిగా తెగ బిజీ అయిపోయాడు. ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేస్తూ కెరీర్‌ను పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. కాగా మళ్లీ నాలుగేళ్లకు మెగాఫోన్ పట్టి ‘దాస్ కా ధమ్కీ’ సినిమాను రూపొందించాడు. ఈ సారి కాస్త ఎక్కువే రిస్క్ చేసి డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టాడు. మొదట పాన్ ఇండియా రిలీజ్ అంటూ ప్రకటించినా.. లాస్ట్‌కు ఒక్క తెలుగులోనే రిలీజ్ చేశాడు.
నాలుగు నెలల కింద రిలీజ్ చేసిన ట్రైలర్‌తో ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఇక మూడు నెలల కింద విడుదలైన ఆల్ మోస్ట్ పడిపోయానే పిల్లా పాట ప్రతీ చెవిలో మోగిపోయింది. ఇలా రిలీజ్‌కు ముందే సినిమాపై తిరగులేని బజ్ ఏర్పడింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తారక్ రావడంతో సినిమాపై హైప్ అమాంతం పెరిగింది. తీరా రిలీజయ్యాక సినిమా బెడిసి కొట్టింది. నటుడుగా డిస్టింక్షన్ సాధించిన విశ్వక్.. దర్శకుడిగా కేవలం పాస్ మార్కులతో సరిపెట్టుకున్నాడని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం బ్లాక్‌బస్టర్ సాధించాడు. వరల్డ్ వైడ్‌గా రూ.25 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టి ఇక్కడ తన మార్కెట్ స్టామినా ఏంటో నిరూపించాడు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌కు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా హక్కులను ఆహా సంస్థ దక్కించుకుంది. కాగా ఏప్రిల్ 14నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. నివేథా హీరోయిన్గా నటించిన ఈ సినిమాను విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మించాడు. ప్రసన్న కుమార్ జెబవాడ కథ, మాటలు అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

