Mogulaiah | పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ పాడిన ఈయన ఎవరు ? నేపథ్యమేంటి ?
Mogulaiah | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే ( Pawan Kalyan Birthday ) సందర్భంగా బీమ్లా నాయక్ ( Bheemla Nayak ) చిత్రంలో టైటిల్ సాంగ్ విడుదలైంది. ఆ టైటిల్ సాంగ్ సంగీత ప్రియులను ఉర్రుతలూగిస్తోంది. టైటిల్ సాంగ్ సాకిని అద్భుతంగా ఆలపించిన జానపద కళాకారుడి గొంతుకు అందరూ ఫిదా అవుతున్నారు. ఆ కళాకారుడి గాత్రం ఆ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే ( Pawan Kalyan Birthday ) సందర్భంగా భీమ్లా నాయక్ ( Bheemla Nayak ) చిత్రంలో టైటిల్ సాంగ్ విడుదలైంది. ఆ టైటిల్ సాంగ్ సంగీత ప్రియులను ఉర్రుతలూగిస్తోంది. టైటిల్ సాంగ్ సాకిని అద్భుతంగా ఆలపించిన జానపద కళాకారుడి గొంతుకు అందరూ ఫిదా అవుతున్నారు. ఆ కళాకారుడి గాత్రం ఆ పాటకే వన్నె తీసుకొచ్చింది. అంత అద్భుతంగా ఆలపించి.. సంగీత ప్రియులను మైమరిపిస్తున్న ఆ జానపద కళాకారుడి జీవిత విశేషాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఆరాటపడుతున్నారు. మరి ఆ జానపద కళాకారుడు ఎవరు? ఆయన కళను వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు? పల్లె నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన ప్రయాణం ఎలా కొనసాగింది?
ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చంపేట మండలంలోని లింగాల గ్రామానికి చెందిన దర్శనం మొగులయ్యనే ఆ జానపద కళాకారుడు. 12 మెట్ల కిన్నెరను వాయించడంలో ఆయనకెవరూ సాటిలేరు. అలా తన తండ్రి నేర్పించిన కళను పలు వేదికలపై ప్రదర్శిస్తూ.. తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.
మొగులయ్య జర్నీ.. పాలమూరు టు ఫిల్మ్ ఇండస్ట్రీ
తండ్రివాయించిన ఏడుమెట్ల కిన్నెర స్థానంలో తన మేధాశక్తితో మూడు ఆనపకాయ (సొరకాయ) బుర్రలను వెదురుబొంగుకు బిగించి 12 మెట్ల కిన్నెర తయారుచేశాడు మొగులయ్య. అలనాటి వీరగాధలకు మాత్రమే తన గొంతును అంకితమిచ్చిన నిస్వార్థ కళాకారుడు. ఈయన చెప్పే వీరగాథల్లో పాలమూరు జిల్లా ప్రాంతంలో సుప్రసిద్ధమైన పండుగ సాయన్న కథ, మియాసాబ్ కథ, శంకరమ్మ కథ, వనపర్తి రాజుల కథలు అద్భుతమైనవి. పాలమూరు జిల్లాకే మొనగాడు సాయన్న అంటూ పండుగ సాయన్న కథ చెప్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటై. తన రాగాలతో సంతలను సంతోషపెట్టారు. పల్లె సంస్కృతిని విధ్వంసంచేస్తున్న బహుళ జాతి కంపెనీల దాష్టీకాన్ని ఎండగట్టారు. ఆయన కళకు మెచ్చి కొందరు ఇచ్చే కానుకలతో గతంలో జీవనం సాగేది.
మొగులయ్య కళను వెలుగులోకి తెచ్చిన ఓయూ స్కాలర్
ఇక గత కొద్ది సంవత్సరాల క్రితం మొగులయ్య కళను ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఓ పీహెచ్డీ స్కాలర్ వెలుగులోకి తీసుకొచ్చారు. నాటి నుంచి మొగులయ్య తన కళను పలు వేదికల మీద ప్రదర్శించి.. ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత మొగులయ్యకు తిరుగు లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనను ఎన్నో రకాలుగా ఆదుకుంది. నెలకు రూ. 10 వేల చొప్పున పెన్షన్‌ను కూడా మంజూరు చేసింది.
తమన్ అవకాశంతో.. అద్భుతమైన గుర్తింపు
పాలమూరు జిల్లాలో పుట్టి పెరిగిన మొగులయ్య జీవన ప్రస్థానం మారుమూల పల్లె నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి చేరింది. ఎన్నో వేదికల మీద తన కళను ప్రదర్శించిన మొగులయ్యకు అరుదైన అవకాశం లభించింది. అది కూడా పవన్ కల్యాణ్ సినిమాలో పాడే అవకాశం. భీమ్లా నాయక్ చిత్రం టైటిల్ సాంగ్‌లో సాకి పాడే అవకాశాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ కల్పించారు. ఆడగాదు ఈడగాదు అమీరోళ్ల మేడగాదు.. గుర్రం నీళ్ల గుట్టకాడ అలుగు వాగు తండాలోన.. బెమ్మజేముడు చెట్టున్నది.. బెమ్మజేట్టుకింద అమ్మ నొప్పులు పడుతున్నది.. అంటూ సాకిని అద్భుతంగా తన గాత్రంతో సంగీత ప్రియులను అలరించాడు దర్శనం మొగులయ్య.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన ‘దర్శనం మొగులయ్య’ వాడే వాద్య పరికరం ఏంటో తెలుసా?
Pawan : పవన్ బర్త్ డే: క్రేజీ అప్డేట్ ఇచ్చిన హరిహర వీరమల్లు టీం
Bheemla Nayak: మస్త్ మజా ఇస్తున్న భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

