Dancers Association | డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయతీ!
Dancers Association | తెలుగు సినీ పరిశ్రమలో కీలకమైన సినీ డాన్సర్స్ అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. యూనియన్ ఆధిపత్యం, అధికారిక గుర్తింపు, బ్యాంకు లావాదేవీలు, నిధుల నిర్వహణ వంటి అంశాలపై రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది.
Dancers Association | తెలుగు సినీ పరిశ్రమలో కీలకమైన సినీ డాన్సర్స్ అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. యూనియన్ ఆధిపత్యం, అధికారిక గుర్తింపు, బ్యాంకు లావాదేవీలు, నిధుల నిర్వహణ వంటి అంశాలపై రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది. కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ నేతృత్వంలోని వర్గానికి, సంఘం నాయకురాలు సుమలత ప్యానెల్‌కు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ వ్యవహారం ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారింది.
రఘు మాస్టర్ నేతృత్వంలోని కమిటీకి చట్టబద్ధమైన అధికారం లేదని సుమలత తన ఫిర్యాదులో ఆరోపించినట్లు సమాచారం. అసోసియేషన్ బైలాస్ నిబంధనలను పక్కన పెట్టి యూనియన్ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె వర్గం ఆరోపిస్తోంది. అంతేకాకుండా యూనియన్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, లావాదేవీలను నియంత్రించే ప్రయత్నంలో ఫోర్జరీ సంతకాలు, తప్పుడు రికార్డులు సమర్పించారనే ఆరోపణలను కూడా సుమలత వర్గం చేసింది. అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, చట్టవిరుద్ధంగా నిధులను డ్రా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ రఘు మాస్టర్ ప్యానెల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది.
అయితే సుమలత వర్గం చేసిన ఆరోపణలను రఘు మాస్టర్ తీవ్రంగా ఖండించారు. తమ కమిటీకే తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అనుబంధ ఫెడరేషన్ ఆమోదం, అధికారిక గుర్తింపు ఉందని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఫెడరేషన్ నుంచి తమకు జారీ అయిన అధికారిక అనుమతి పత్రాల ఆధారంగానే బ్యాంకును సంప్రదించామని రఘు మాస్టర్ వర్గం చెబుతోంది. తాము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమిటీ అని, యూనియన్ అభివృద్ధిని కొందరు వ్యక్తులు అడ్డుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసోసియేషన్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సభ్యుల్లో అనవసర గందరగోళం సృష్టిస్తున్నారని రఘు మాస్టర్ వర్గం మండిపడుతోంది. విధులకు ఆటంకం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల నుంచి రాతపూర్వక ఫిర్యాదులు స్వీకరించిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివాదానికి సంబంధించిన బ్యాంకు పత్రాలు, అధికారిక లేఖలు, డాన్సర్స్ యూనియన్ బైలాస్, ఫిల్మ్ ఫెడరేషన్‌కు సంబంధించిన నిర్ణయాలు, అనుమతి పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

