నా కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్ ‘సైంధవ్’
న్యూఏజ్ యాక్షన్ థ్రిల్లర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. కథ మొదలైన 15నిమిషాల్లోనే భావోద్వేగాలతో ప్రేక్షకులు సహానుభూతి చెందుతారు.
‘న్యూఏజ్ యాక్షన్ థ్రిల్లర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. కథ మొదలైన 15నిమిషాల్లోనే భావోద్వేగాలతో ప్రేక్షకులు సహానుభూతి చెందుతారు. నా కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్‌గా చెప్పొచ్చు’ అన్నారు వెంకటేష్. ఆయన కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించిన ‘సైంధవ్’ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ట్రైలర్‌ను ఆవిష్కరించారు. కూతురే సర్వస్వంగా జీవిస్తుంటాడు తండ్రి. ఇంతలో ఆ చిన్నారికి మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. వ్యాధిని నయం చేసే ఇంజక్షన్ ఖరీదు 17కోట్లు. ఈ క్రమంలో ఆ తండ్రి పడే సంఘర్షణ, ప్రత్యర్థులతో చేసే పోరాటం నేపథ్యంలో ట్రైలర్ ఆద్యంతం భావోద్వేగ ప్రధానంగా సాగింది. యాక్షన్ ఘట్టాలు రొమాంచితంగా అనిపించాయి. దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ ‘ట్రైలర్లో కథ మొత్తం చెప్పాను. ఇంత ధైర్యంగా కథ రివీల్ చేశానంటే సినిమాలోని ఉద్వేగాలు ఏ స్థాయిలో ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా. హాలీవుడ్ స్థాయి హంగులతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ సంక్రాంతికి అందరిని ఎంటర్టైన్ చేస్తుంది’ అన్నారు. వెంకటేష్ అంటే తనకు ఎంతో గౌరవం, ఇష్టమని..ఈ సినిమా ఓ విందు భోజనంలా ఉంటుందని చిత్ర నిర్మాత వెంకట్ బోయనపల్లి చెప్పారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధాశ్రీనాథ్, రుహానీ శర్మ, సారా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్నందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

