అభిమానులకు ఇక పండగే!
వచ్చే సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈసారి యాక్షన్ డోస్ కాస్త తగ్గించి తనదైన వింటేజ్ కామెడీతో అభిమానుల్లో జోష్నింపబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల..’ పాట సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి సినిమాపై అంచనాలను పెంచింది.
వచ్చే సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈసారి యాక్షన్ డోస్ కాస్త తగ్గించి తనదైన వింటేజ్ కామెడీతో అభిమానుల్లో జోష్నింపబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల..’ పాట సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి సినిమాపై అంచనాలను పెంచింది. ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఈ సినిమాలో అగ్ర నటుడు వెంకటేష్ కీలకమైన అతిథి పాత్రలో కనిపించబోతుండటం స్పెషల్ అట్రాక్షన్. సమకాలీనులైన ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు ఓ విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు.
ప్రస్తుతం ఈ సినిమా తాలూకు ఓ పబ్సాంగ్ను తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో ఈ పాట చిత్రీకరణ జరుగుతున్నదని, ఇందులో చిరు, వెంకీ కలిసి స్టెప్పులేస్తున్నారని సమాచారం. భీమ్స్ హుషారైన బీట్, చిరు-వెంకీ సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఈ పాట ఉర్రూతలూగించడం ఖాయమంటున్నారు. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తయినట్లే అని చెబుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

