Daggubati Abhiram | అహింస కోసం రోజూ 50 కిలోల బరువు మోసిన అభిరామ్.. ఎందుకంటే..?
Daggubati Abhiram | టాలీవుడ్ డైరెక్టర్ తేజ (Teja) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. తనకు కావాల్సిన సన్నివేశాన్ని రాబట్టుకోవడం కోసం ఎంతటి రిస్క్ అయినా చేయడానికి వెనకాడనే పేరు కూడా తేజకు ఉంది.
టాలీవుడ్ డైరెక్టర్ తేజ (Teja) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. కొత్త నటీనటులను లాంఛ్ చేసే అతికొద్ది మంది దర్శకుల్లో తేజ ఒకరు. తేజ డైరెక్షన్లో సినిమా చేసిన యాక్టర్లు భవిష్యత్‌లో సక్సెస్ఫుల్ జర్నీ సాగించడం దాదాపు కన్ఫామ్ అయిపోయనట్టేనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన ట్రైనింగ్ అలా ఉంటుంది. తనకు కావాల్సిన సన్నివేశాన్ని రాబట్టుకోవడం కోసం ఎంతటి రిస్క్ అయినా చేయడానికి వెనకాడడనే పేరు కూడా ఉంది.
నటుడిగా తేజను ఇంప్రెస్ చేయడమంటే చాలా టాస్క్‌లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటి టాస్క్ చేసేందుకు అన్ని విధాలా రెడీ అయ్యాడు నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు కుమారుడు అభిరామ్ (Abhiram Daggubati). ఎంతో కష్టపడి మొత్తానికి డెబ్యూ ప్రాజెక్ట్ అహింస (Ahimsa) సినిమా పూర్తి చేశాడు అభిరామ్ . ప్రతిరోజు సినిమా కోసం అభిరామ్ రామానాయుడు స్టూడియోస్‌లో కొండ కింద నుండి పైకి సైకిల్‌పై తిరిగాడని.. అయితే ఆ షాట్లను సినిమాలో ఉపయోగించలేదని తేజ చెప్పడం.. అభిరామ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో అర్థం చేసుకోవచ్చు.
అహింస సీన్ షూటింగ్లో భాగంగా అభిరామ్ ఓ చేతిలో గన్, మరోచేతి భుజంపై హీరోయిన్ను వేసుకుని పరుగెత్తినప్పుడు కిందపడటంతో గాయపడగా.. యూనిట్ అంతా 4 నెలల విరామం తీసుకోవాల్సి వచ్చిందట. అయితే అభిరామ్ మాత్రం ఎలాగైనా ఆ షాట్‌ను పర్ఫెక్ట్గా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. కొన్ని వారాలపాటు తన భుజంపై 50 కిలోల బరువుతో రన్నింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ ప్రాక్టీస్ సెషన్‌ను ప్రతీ రోజూ వీడియో తీసి తేజకు పంపాడు. అభిరామ్ ఫైనల్‌గా తేజ అనుకున్నట్టుగా ఆ షాట్‌ను హీరోయిన్‌తో ముగించాడు.
పెద్ద కుటుంబం నుంచి వచ్చినా సినిమా బెస్ట్‌గా వచ్చేందుకు అభిరామ్‌ను చాలా టార్చర్ పెట్టినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు తేజ. ఇక అభిరామ్ కూడా తనను తాను లీడ్ రోల్లో ప్రూవ్ చేసుకునేందుకు తన పాత్రను సీరియస్‌గా తీసుకుని ఎన్నికష్టాలైనా భరించినట్టు చెప్పాడు. అహింస చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై పీ కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గీతికా హీరోయిన్గా నటిస్తోంది. లవ్ ట్రాక్‌తోపాటు ఫ్యామిలీ, ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు తేజ.
అహింసలో యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని విలన్‌గా నటిస్తున్నాడు. రజత్ బేడి, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవీ ప్రసాద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రం జూన్ 2న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఉందిలే ఉందిలే లిరికల్ వీడియో సాంగ్..
అహింస టీజర్..
అహింస ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

