Dada | బాలయ్య ‘దాదా’లో క్రేజీ ఐటెం సాంగ్.. థమన్ ఈసారి కూడా మాస్ బీట్తో దుమ్మురేపనున్నాడా?
Dada | నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘దాదా’ ఒకటి. గతంలో బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్ణయించిన సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం కష్టపడుతోంది.
Dada | నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘దాదా’ ఒకటి. గతంలో బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్ణయించిన సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం కష్టపడుతోంది. మరోవైపు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఎస్.ఎస్. థమన్ విషయంలోనూ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ఉండబోతుందనే ప్రచారం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
బాలకృష్ణ, థమన్ కాంబినేషన్‌కు టాలీవుడ్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన పాటలు, నేపథ్య సంగీతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా థమన్ అందించే బాణీలు థియేటర్లలో అభిమానులతో విజిల్స్ వేయిస్తుంటాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో పాటలు మంచి ఆదరణ పొందడంతో ‘దాదా’పై కూడా సంగీతం విషయంలో అంచనాలు పెరిగాయి. ఇప్పటికే బాలకృష్ణ సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా థమన్ అందించే బీట్స్ ఈ పాటలకు మరింత ఊపునిస్తుంటాయి. ఇప్పుడు ‘దాదా’ సినిమాలో కూడా ఓ ప్రత్యేకమైన ఐటెం సాంగ్ ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పాట కోసం థమన్ అదిరిపోయే మాస్ బీట్స్ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రత్యేక పాటలో బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసే బ్యూటీ ఎవరనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో బాలయ్య సినిమాల్లో ప్రత్యేక పాటలు చేసిన హీరోయిన్ల తరహాలో ఈసారి కూడా ఓ క్రేజీ హీరోయిన్ను తీసుకురాబోతున్నారా? అనే చర్చ జరుగుతోంది. అయితే ఈ పాటలో నటించబోయే హీరోయిన్ ఎవరు? పాట చిత్రీకరణ ఎప్పుడు జరగనుంది? అనే విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్, ఎమోషన్స్, పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dada | బాలయ్య ‘దాదా’లో క్రేజీ ఐటెం సాంగ్.. థమన్ ఈసారి కూడా మాస్ బీట్తో దుమ్మురేపనున్నాడా?
Ramayana | రామ్ – రావణ్ వైభవాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.. ‘రామాయణ’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

