Daaku Maharaaj OTT | ఓటీటీలోకి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డాకు మహారాజ్’ ఓటీటీ లాక్ చేసుకుంది.
Daaku Maharaaj Netflix | అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj). ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా.. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. అనగనగా ఒక రాజు.. చెడ్డవాళ్లందరూ డాకు అనేవాళ్లు.. కానీ మాకు మాత్రం మహారాజ్ అంటూ నెట్‌ఫ్లిక్స్ రాసుకోచ్చింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విద్యావేత్త, ఓ పెద్ద స్కూల్‌కి అధినేత అయిన కృష్ణమూర్తి(సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు(రవి కిషన్) లీజుకు తీసుకుంటాడు. అయితే.. అక్కడ తోటను పండించకుండా వన్యప్రాణులను చంపి వాటి శరీరాలతో వ్యాపారం చేస్తుంటాడు. ఈ విషయం తెలిసిన కృష్ణమూర్తి పోలీసులను ఆశ్రయిస్తాడు. త్రిమూర్తులుపై కేసు పెడతాడు. దాంతో కృష్ణమూర్తిపై పగబట్టిన త్రిమూర్తులు.. కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవికి ప్రాణహాని తలపెడతాడు. కృష్ణమూర్తి ఇంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి(మకరంద్ దేశ్‌పాండే) ఆ విషయాన్ని పసిగట్టి వెంటనే.. చంబల్‌లోని మోస్ట్ వాంటెడ్ ‘డాకు మహారాజ్'(బాలకృష్ణ)కు కబురు పంపుతాడు. నానాజీ పేరుతో డాకు మహారాజ్ ఆ ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. అసలు ఈ ‘డాకు మహారాజ్’ ఎవరు? వైష్ణవి పాపకు డాకు మహారాజ్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఈ కథతో బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్), నందిని(శ్రద్ధా శ్రీనాథ్)కి సంబంధ ఏంటి? అసలు ఆ ఇంట్లోకి నానాజీగా డాకు మహారాజ్ రావాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
Anagananaga oka raju.. cheddavalu andharu Daaku anevaalu… kaani maaku mathram Maharaaju!
Watch Daaku Maharaaj, out on 21 Feb on Netflix! #DaakuMaharaajOnNetflix pic.twitter.com/xkljLJmQeJ
— Netflix India South (@Netflix_INSouth) February 16, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

