MAA: మా ఎన్నికల నుంచి తప్పుకున్న సీవీఎల్…!

అక్టోబర్ 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరంతా నామినేషన్ వేయగా, ఒక్కొక్కరు మేనిఫెస్టో ప్రకటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కొద్ది సేపటి క్రితం సీవీఎల్ నరసింహారావు తన మేనిఫెస్టో కూడా ప్రకటించారు.
అనూహ్యంగా సీవీఎల్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మా అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ను ఆయన ఉపసంహరించుకున్నారు. కారణం రెండు రోజుల్లో చెప్తాను.నేను ఎవ్వరికి మద్దతు ఇవ్వడం లేదు అని ఆయన తెలిపారు.
నామినేషన్ ఉపసంహరించుకునే ముందు సీవీఎల్ ప్రకటించిన మేనిఫెస్టో ఇదే..!
- 2011 లో మనం పాస్ చేసుకున్న రిజల్యూషన్ పర్ఫెక్ట్ గా అమలు చేయడం , దాని వలన ఆర్టిస్టుల అందరికీ అవకాశాలు వస్తాయన్నారు సీవీఎల్.
- అసోసియేషన్లోని ప్రతిసభ్యుడికీ సంవత్సరానికి రూ.3 లక్షలు ఆరోగ్య బీమా ‘మా’ చెల్లిస్తుంది. అది వచ్చే ఏడాది జనవరి నుంచి అన్ని విధాలుగా అమలయ్యేలా చేస్తాం.
- ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో ‘మా’ సభ్యుడికి అసోసియేట్ మెంబర్షిప్ సంపాదించడం.
- వృద్ధ కళాకారులకు ప్రస్తుతం రూ.6 వేలు పింఛను ఇస్తున్నారు. నవంబర్ నుంచి రూ.10 వేలు ఇచ్చేలా చర్యలు.
- 20 ఏళ్ల క్రితం మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘ఆసరా’ని పునఃప్రారంభిస్తాం. ఆసరా కమిటీలో ఉండే 13 మంది పేర్లను త్వరలోనే ప్రకటిస్తాను.
- ఎవరైనా ‘మా’ సభ్యుడు ఆకలి భాధలు పడుతుంటే.. కాల్ చేసిన రెండు గంటల్లోనే అతడి ఇంటికి నెల రోజులకు సరిపడా వంట సామగ్రిని పంపిస్తాను.
- ఆడవాళ్ళకు ఉపయోగపడే ఆసరాని 20 ఏళ్లు క్రితం పెట్టాము .. మళ్ళీ రివైవ్ చేస్తాము అని అన్నారు సీవీఎల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

