నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా
‘నా కెరీర్లో భారీ వ్యయంతో నిర్మించిన చిత్రమిది. కథ విని చాలా ఎక్సైట్ అయ్యాను. యాక్షన్ ఎపిసోడ్స్ మరో స్థాయిలో ఉంటాయి’ అన్నారు అక్కినేని నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. తెలుగు, తమిళ భాషల్లో వెంకట్ ప్రభు తెరకెక్కించారు.
‘నా కెరీర్లో భారీ వ్యయంతో నిర్మించిన చిత్రమిది. కథ విని చాలా ఎక్సైట్ అయ్యాను. యాక్షన్ ఎపిసోడ్స్ మరో స్థాయిలో ఉంటాయి’ అన్నారు అక్కినేని నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. తెలుగు, తమిళ భాషల్లో వెంకట్ ప్రభు తెరకెక్కించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ నెల 12న విడుదలకానుంది. ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ‘ఈ సినిమా మొదటి ఇరవై నిమిషాలు చాలా కూల్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు నుంచి అసలైన యాక్షన్ మొదలవుతుంది. ఈ సినిమాలో కొత్త చైతన్యను చూడబోతున్నారు. నా కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రమిది’ అన్నారు. ‘కథలో యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, సెంటిమెంట్ అన్ని అంశాలుంటాయి. హృదయాన్ని తడిమే భావో ద్వేగాలుంటాయి. అరవింద్‌స్వామి, ప్రియమణి పవర్ఫుల్ పాత్రలు చేశారు.
ఈ సినిమా విషయంలో నన్ను బలంగా నమ్మిన నాగచైతన్యకు కృతజ్ఞతలు’ అని దర్శకుడు వెంకట్‌ప్రభు తెలిపారు. తన జీవితంలో స్ఫూర్తినిచ్చే వ్యక్తుల్లో నాగచైతన్య ఒకరని కృతిశెట్టి పేర్కొంది. యాక్షన్, సందేశం కలబోసిన ఈ కథ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ప్రియమణి పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

