Custody Movie | కోలీవుడ్‌లో కస్టడీ వర్కవుట్ అయ్యేలా కనిపిస్తుందే..!
Custody Movie In Tamil | అక్కినేని ఫ్యాన్స్‌కు ఈ సారి కూడా నిరాశే ఎదురైంది. గంపెడంత ఆశలు పెట్టుకున్న కస్టడీ తొలిరోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా దారుణంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అటు ఇటుగా రూ.7 కోట్ల వరకు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
Custody Movie In Tamil | అక్కినేని ఫ్యాన్స్‌కు ఈ సారి కూడా నిరాశే ఎదురైంది. గంపెడంత ఆశలు పెట్టుకున్న కస్టడీ తొలిరోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా దారుణంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అటు ఇటుగా రూ.7 కోట్ల వరకు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఓ లెక్కన చూస్తే ఇది బెటర్ నెంబర్ అనే అనొచ్చు. కానీ సినిమాకు జరిగిన బిజినెస్‌కు ఇది సరిపోదు. పైగా శని, ఆదివారాల్లో బుకింగ్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఇక తెలుగు రాష్ట్రాల సంగతి అటుంచితే ఈ సినిమాను ద్విభాషా చిత్రంగా తమిళంలోనూ ఏకకాలంలో రిలీజ్ చేశారు.
తమిళంలో ఈ సినిమా కేవలం వెంకట్ ప్రభు క్రేజ్‌తోనే రిలీజైంది. పోటీగా మూడు, నాలుగు సినిమాలుండటంతో థియేటర్ కౌంట్ కూడా తక్కువగానే ఉంది. అయితే ఈ సినిమా ఉన్నంతలో బాగానే లాక్కొచ్చిందని కోలీవుడ్ మీడియా సమాచారం. చాలా వరకు తమిళ ప్రేక్షకులు ఈ సినిమాపై పాజిటీవ్‌గానే స్పందిస్తున్నారని, తొలిరోజుకు మించి రెండో రోజు కలెక్షన్లు వస్తాయని, బుకింగ్స్ కూడా అదరిపోయే రేంజ్లో ఉన్నాయని అంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే నాగచైతన్యకు తమిళంలో మార్కెట్ ఏర్పడినట్లే. అయితే రెండు రోజుల కలెక్షన్లు చూసి మార్కెట్ అంచనా వేయడం కరెక్ట్కాదు. ఫైనల్ రన్లో ఈ సినిమా ఎన్ని లాభాలు తెచ్చిపెట్టింది అనేదానిపైనే మార్కెట్ ఆధారపడి ఉంటుంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించాడు. నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. అరవింద్ స్వామి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. నటి ప్రియమణి కీలకపాత్ర పోషించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

