Custody Movie | కస్టడీ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. పోలీసుల గొప్పతనాన్ని చాటి చెబుతున్న పాట
Custody Movie First Single | ద్విభాషా సినిమాగా తెరకెక్కిన కస్టడీ మూవీను మానాడు ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేసింది. పైగా తొలిసారి నాగచైతన్య కానిస్టేబుల్ పాత్ర పోషించనుండటంతో విపరీతమైన హైప్ నెలకొంది.
Custody Movie First Single | మరో నెల రోజుల్లో నాగచైతన్య ‘కస్టడీ’ సినిమా విడుదల కానుంది. నాగచైతన్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇదే. ఈ సినిమాలో చై కానిస్టేబుల్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. పైగా ‘మానాడు’ వంటి బ్లాక్‌బస్టర్‌ను తెరకెక్కించిన వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ద్విభాషా సినిమాగా రూపొందిన కస్టడీ మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ఇప్పటి నుంచే అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై కావాల్సినంత హైప్ క్రియట్ చేస్తున్నారు. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది.
హెడ్ అప్ హై అంటూ పోలిసుల గొప్పతనాన్ని తెలిపే ఈ సాంగ్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంయుక్తంగా స్వర పరిచిన ఈ పాటను అరుణ్ కౌండిన్యతో కలిసి యువన్ ఆలపించాడు. రామ జోగయ్య శాస్త్రీ ఈ పాటకు సాహిత్య అందించాడు. పాట వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు. నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. అరవింద్ స్వామి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. నటి ప్రియమణి కీలకపాత్ర పోషిస్తుంది. ఇక ఈ సినిమాకు నాన్-థియేట్రికల్ హక్కుల రూపంలో భారీ స్థాయిలోనే ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. అంతేకాకుండా నాగచైతన్య మార్కెట్‌కు రెండు రెట్లు అధికంగా బిజినెస్ జరుగుతుందని మేకర్స్ తెలుపుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

