Ullozhukku | ‘కర్రీ అండ్ సైనైడ్’ దర్శకుడి నుంచి మరో క్రైమ్ థ్రిల్లర్.. ఇంట్రెస్టింగ్గా ‘ఉళ్ళోళుక్కు’ ట్రైలర్
Ullozhukku Teaser | 'కర్రీ అండ్ సైనైడ్'(Curry & Cyanide) : ది జాలీ జోసెఫ్ కేస్ అనే డాక్యుమెంటరీ వెబ్ సిరీస్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు క్రిస్టో టామీ(Christo Tomy). ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్ 'ఉళ్ళోళుక్కు' (Ullozhukku)
Ullozhukku Teaser | ‘కర్రీ అండ్ సైనైడ్'(Curry & Cyanide) : ది జాలీ జోసెఫ్ కేస్ అనే డాక్యుమెంటరీ వెబ్ సిరీస్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు క్రిస్టో టామీ(Christo Tomy). ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్ ‘ఉళ్ళోళుక్కు’ (Ullozhukku). మలయాళ స్టార్ నటి పార్వతి తిరువోతు, సీనియర్ నటి ఊర్వశి ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. షెబిన్ బెన్సన్, అర్జున్ రాధాకృష్ణన్, వీణా నాయర్, అలెన్సియర్ లే లోపెజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఇప్పటికే టీజర్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా ట్రైలర్ వదిలారు.
ఈ ట్రైలర్ గమనిస్తే.. కొత్తగా పెళ్లి అయ్యి అత్తారింటికి వచ్చిన పార్వతి తన భర్తతో సంతోషంగా గడుపుతుంది. అయితే అనుకోకుండా తన భర్త ఒక ప్రమాదంలో చనిపోతాడు. ఈ క్రమంలోనే పార్వతికి అక్కడ ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయి. అందరూ పార్వతినే ఎందుకు సందేహంగా చూస్తుంటారు అనేది సస్పెన్స్‌గా ఉంది. ఇక కర్రీ అండ్ సైనైడ్ లాగానే ఇది కూడా క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఆర్ఎస్విపి, మాక్‌గఫిన్ పిక్చర్స్ బ్యానర్లపై రోనీ స్క్రూవాలా, హనీ ట్రెహాన్, అభిషేక్ చౌబే సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
Bank collapse In Paraguay | బ్యాంకు పతనంతో నిరసనలు.. పరాగ్వే అధ్యక్షుడు గృహ నిర్బంధం
Health tips | డయాబెటిస్ ఉన్నవాళ్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏం జరుగుతుంది..!
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

