అందాల నైషధం
తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా చలామణీ అవుతున్నది మలయాళీ సోయగం సంయుక్తమీనన్. ప్రస్తుతం ఈ భామ కల్యాణ్‌రామ్ సరసన పీరియాడిక్ స్పైథ్రిల్లర్ ‘డెవిల్'లో నటిస్తున్నది.
తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా చలామణీ అవుతున్నది మలయాళీ సోయగం సంయుక్తమీనన్. ప్రస్తుతం ఈ భామ కల్యాణ్‌రామ్ సరసన పీరియాడిక్ స్పైథ్రిల్లర్ ‘డెవిల్’లో నటిస్తున్నది. స్వీయ దర్శకనిర్మాణంలో అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నారు. సోమవారం సంయుక్తమీనన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె సంప్రదాయ వస్త్రధారణలో వెలిగిపోతున్నది.
పూలబుట్టని చేత పట్టుకొని దైవ దర్శనానికి వెళ్తూ ప్రశాంత వదనంతో కనిపిస్తున్నది. ఎవరికీ అంతుపట్టని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కల్యాణ్‌రామ్ పాత్ర ఉత్కంఠను పంచుతుందని, కథానాయిక సంయుక్త మీనన్ నైషధ అనే సంప్రదాయ అమ్మాయి పాత్రలో కనిపిస్తుందని దర్శకుడు అభిషేక్ నామా తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్ ఎస్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా, నిర్మాణ సంస్థ: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత, దర్శకత్వం: అభిషేక్ నామా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

