Cruise Drugs Case | ఆర్యన్‌తో డ్రగ్స్ చాట్.. జోక్ చేశానంటున్న హీరోయిన్
Cruise Drugs Case | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ అరెస్టయిన ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో హిందీ భామ అనన్య పాండేను

ముంబై: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ అరెస్టయిన ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో హిందీ భామ అనన్య పాండేను కూడా నార్కొటిక్స్ బ్యూరో అధికారులు విచారణకు తీసుకెళ్లారు. ఆర్యన్‌కు రెండు, మూడుసార్లు డ్రగ్ డీలర్ల నెంబర్లు ఆమె ఇచ్చినట్లు ఎన్సీబీ అధికారులు ఆరోపించారు.
ఎన్సీబీ విచారణకు హాజరైన అనన్య తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, ఎవరికీ సరఫరా చేయలేదని తేల్చిచెప్పింది. తనపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించింది. అయితే ఆర్యన్, అనన్య మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్ పరిశీలించిన అధికారులు 2018-19 మధ్య కనీసం మూడుసార్లు ఆర్యన్‌కు డ్రగ్స్ అందేలా ఆమె ఏర్పాట్లు చేసినట్లు ఆరోపించారు.
వీటిలో రెండుసార్లు ఆర్యన్‌కు వ్యక్తిగతంగా, ఒకసారి గెట్ టుగెదర్ పార్టీలో ఆమె డ్రగ్స్ ఏర్పాటు చేసిందట. ఆర్యన్‌కు కొందరు డ్రగ్ డీలర్ల నెంబర్లను కూడా ఆమె అందించిందని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. ఒకానొక సందర్భంలో తనకు ‘జుగాద్’ కావాలని ఆర్యన్ ఆమెను అడగ్గా ‘నేను ఏర్పాటు చేస్తా’ అని ఆమె బదులిచ్చినట్లు సమాచారం.

ఈ చాట్స్ విషయంలో అనన్యను ఎన్సీబీ అధికారులు ప్రశ్నించగా తాను జోక్ చేశానని ఆమె బదులివ్వడం గమనార్హం. తనకు డ్రగ్స్‌తో అసలు సంబంధం లేదని, ఆర్యన్‌తో కేవలం జోక్ చేశానని ఆమె చెప్పిందని తెలుస్తోంది. అలాగే తమ మధ్య జరిగిన సంభాషణ సిగరెట్స్ గురించని, డ్రగ్స్ గురించి కాదని ఆమె చెప్పింది.
ముంబై నుంచి గోవా వెళ్తున్న ఒక క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అక్కడ షారుఖ్ తనయుడితోపాటు మరో 8 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

