Bigg Boss 9 | బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లేందుకు ఆసక్తిచూపుతున్న సామాన్యులు..ఆ 40 మందికి అగ్ని పరీక్ష
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 9 ప్రకటించిన నాటి నుంచి హైప్ ఊపందుకుంది. కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరించబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇది షోపై అమితాసక్తిని కలిగించింది. ఇప్పటి వరకూ సెలబ్రిటీలకే హౌస్‌లోకి ప్రవేశం లభించగా, ఈ సీజన్లో మాత్రం నిర్వాహకులు కొత్త ప్రయోగానికి దిగారు.
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 9 ప్రకటించిన నాటి నుంచి హైప్ ఊపందుకుంది. కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరించబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇది షోపై అమితాసక్తిని కలిగించింది. ఇప్పటి వరకూ సెలబ్రిటీలకే హౌస్‌లోకి ప్రవేశం లభించగా, ఈ సీజన్లో మాత్రం నిర్వాహకులు కొత్త ప్రయోగానికి దిగారు. సామాన్యులకు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని కల్పించారు. దీంతో యువత నుంచి విశేష స్పందన వస్తుంది. వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించి, “బిగ్ బాస్ హౌస్‌లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు?” అనే అంశంపై వీడియోలు కోరారు. దీనికి భారీ స్పందన వచ్చింది.
వేలాది అప్లికేషన్లలో తొలి దశకు 200 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎక్స్ప్రెషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా 100 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. చివరకు వీరిలో నుంచి 40 మందిని ఫైనల్ రౌండ్‌కు ఎంపిక చేశారు. వీరిలో 3 నుంచి 4 మందిని ఎంపిక చేసి, వారిని ‘బిగ్ బాస్’ హౌస్‌లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. సామాన్యుల ఎంపిక ఈ నెలలోనే పూర్తి చేయాలని షో టీం భావిస్తోంది. సెప్టెంబర్ 7న సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. షో స్టార్ మాలో టెలికాస్ట్ అవుతుండగా, జియో హాట్ స్టార్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది.
ఈ సీజన్లో పాపులర్ బుల్లితెర యాక్టర్లు, సోషల్ మీడియా సెలబ్రిటీలు, ఫోక్ సింగర్స్, ఓటీటీ స్టార్స్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్. ఇప్పటి వరకు వినిపిస్తున్న జాబితాలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్ ఐశ్వర్య, బమ్ చిక్ బబ్లూ, రీతూ చౌదరి, సీరియల్ యాక్టర్లు సాయికిరణ్, దేబ్జానీ, కావ్యశ్రీ, కన్నడ నటి కావ్యా శెట్టి, అలేఖ్య చిట్టి, పికెల్స్ ఫేం రమ్య, కల్పికా గణేష్, సుమంత్ అశ్విన్, ఆర్జే రాజ్, శ్రావణి వర్మ, తేజస్విని గౌడ, దీపికా, వర్ష, పరమేశ్వర్ హివ్రాలే, తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గా దత్తా, ఫోక్ సింగర్ లక్ష్మి వంటి వారు హౌజ్‌లోకి ప్రవేశించచనున్నారని టాక్. ఇవన్నీ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్లు మాత్రమే. అధికారిక లిస్టు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

