సాత్విక్‌వర్మ, నేహాపఠాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యాచ్’. శివ దర్శకుడు. రమేష్ గనమజ్జి, బీరం సుధాకర్ నిర్మాతలు. ఇటీవల ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. క్రికెట్ బెట్టింగ్స్, బైక్ దొంగతనాలకు థ్రిల్లర్, ప్రేమ అంశాలను జోడించి తెరకెక్కిస్తున్నాం. త్వరలో ట్రైలర్, పాటల్ని విడుదలచేస్తాం’ అని తెలిపారు. కాలకేయ ప్రభాకర్, వినోద్‌కుమార్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె.