మోహనకృష్ణ ఇంద్రగంటి సూపర్ హీరో చిత్రం
క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి ఓ సూపర్ హీరో చిత్రాన్ని రూపొందించబోతున్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి ఓ సూపర్ హీరో చిత్రాన్ని రూపొందించబోతున్నారు. రోషన్ మేక కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అశోక క్రియేషన్స్ పతాకంపై అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీకాంత్ క్లాప్‌నివ్వగా, ముప్పా వెంకయ్య చౌదరి కెమెరా స్విఛాన్ చేశారు.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, వీఎఫ్ఎక్స్ వర్క్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుందని, డిసెంబర్ మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి రేఖా పాండే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, సంగీతం: గౌరహరి, ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ సబ్బాని, మోనికా నిగోట్రే, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

