Naga Chaitanya | డీజే టిల్లు డైరెక్టర్‌తో నాగచైతన్య..నిజమెంత..!
యువ దర్శకుడు విమల్ కృష్ణ నెక్ట్స్ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అక్కినేని హీరో నాగచైతన్య (Akkineni Naga Chaitanya)కు ఓ కథ వినిపించాడట విమల్ కృష్ణ(Vimal Krishna).
డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ (Tollywood) అగ్రనిర్మాతల దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు విమల్ కృష్ణ. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా ఈ యువ దర్శకుడు నెక్ట్స్ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అక్కినేని హీరో నాగచైతన్య (Akkineni Naga Chaitanya)కు ఓ కథ వినిపించాడట విమల్ కృష్ణ(Vimal Krishna). ఈ కథ చైతూకు కూడా బాగా నచ్చిందని ఇన్ సైడ్ టాక్.
అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్‌కు సంబంధించిన వార్త త్వరలోనే బయటకు రానుందని ఇపుడు తెగ చర్చ నడుస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు చైతూ. ఈ యువ హీరో మరి డీజే టిల్లు డైరెక్టర్‌తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం చైతూ ఒప్పుకున్న సినిమాలు ముగియగానే..విమల్ కృష్ణ సినిమాపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
చైతూ కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు పరశురాంతో ఓ సినిమా చేయబోతున్నాడు నాగచైతన్య.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

