చిరుపై ప్రశంసలు.. నాగ్‌పై విమర్శలు.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : సినీ హీరో అక్కినేని నాగార్జునపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తూ.. నాగార్జునను తీవ్రంగా విమర్శించారు. చిరంజీవికి, నాగార్జునకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని నారాయణ పేర్కొన్నారు. తిరుపతిలో నారాయణ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
బిగ్‌బాస్‌ను విమర్శిస్తే మహిళలను విమర్శించినట్లు కాదని నారాయణ స్పష్టం చేశారు. కోకో కోలా యాడ్‌లో నటించొద్దంటే చిరంజీవి ఆపేశారని గుర్తు చేశారు. కానీ బిగ్ బాస్ చేయొద్దని నాగార్జునకు ఎన్నిసార్లు చెప్పినా, డబ్బు కోసం కక్కుర్తి పడుతూ, ఆ షో నిర్వహిస్తున్నాడని దుయ్యబట్టారు.
బిగ్‌బాస్ రియాల్టీ షో ఓ బ్రోతల్ హౌస్ అని తాను చేసిన కామెంట్స్‌కు కట్టుబడి ఉన్నట్టు నారాయణ తేల్చి చెప్పారు. బ్రోతల్ హౌస్‌లో మహిళలతో పాటు పురుషులు కూడా ఉంటారని చెప్పుకొచ్చారు. మహిళలను కించపరిచినట్టు తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందన్న నారాయణ.. తనను బ్లాక్ మెయిల్ చేయడం ఎవరి వల్ల కాదన్నారు. కాగా, కళాకారులపై తనకు గౌరవం ఉందన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

