Jani Master | కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ మంజూరుచేసిన కోర్టు
లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Jani Master) ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Jani Master) ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెప్టెంబర్ 16న ఆయనపై నార్సింగి పోలీసులు 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. కోర్టు ఆయకు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో ఈ నెల 6 నుంచి 9 వరకు ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియడంతో ఆయన మళ్లీ జైలుకు వెళ్లారు. కాగా, రెగ్యులర్ బెయిల్ కోసం పోక్సో కోర్టులో దాఖలు చేసిన పిటిషనన్ను ఈ నెల 14న కోర్టు తిరస్కరించింది. తాజాగా ఆయనకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన గురువారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నది.
2017లో ఒక టీవీ షోలో పాల్గొన్న మహిళా డ్యాన్సర్‌తో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ముంబైలోని ఓ హోటల్లో తనపై లైంగికదాడికి పాల్పడినట్టు తెలిపింది. నార్సింగి పోలీసులు జానీమాస్టర్‌పై 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని పోలీసులు ఇంట్లోనే విచారించారు. అనంతరం ఆమె నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని మరిన్ని వివరాలను తెలిపింది. మతం మార్చుకుని వివాహం చేసుకోవాలని వేధిస్తున్నాడని చెప్పింది. ఒప్పుకోకుంటే అవకాశాలు రాకుండా అడ్డుకుంటానని బెదిరించినట్టు తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

