వెంకటేష్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళంలో విజయవంతమైన ‘అసురన్’ చిత్రానికి రీమేక్ ఇది. సురేష్‌బాబు, కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమాలోని ‘చలాకీ చిన్నమ్మీ..’ అనే పాటను ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు. ‘తన భూమిని కాపాడుకునే ప్రయత్నంలో పెత్తందారులపై అతి సామాన్యుడైన నారప్ప చేసిన పోరాటం, ఈ క్రమంలో ఆయనకు ఎదురైన పరిస్థితులేమిటన్నదే చిత్ర ఇతివృత్తం. సామాజిక సందేశంతో పాటు సంఘర్షణ కలబోసిన చిత్రమిది. వెంకటేష్ పాత్ర చిత్రణ భిన్న పార్శాల్లో సాగుతుంది. ఆయన భార్య సుందరమ్మగా ప్రియమణి మంచి పాత్రను పోషించింది’ అని చిత్రబృందం తెలిపింది. కార్తిక్త్న్రం, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు, సంగీతం: మణిశర్మ, కథ: వెట్రిమారన్, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.