ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కీడా కోలా’. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం వరదరాజుగా కనిపించబోతున్నాడు. ‘బ్రహ్మానందం గారిని నెవర్ బిఫోర్ అవతార్‌లో చూపించబోతున్నాం.. ప్రతి ఇంట్లో వుండే తాత పాత్రలో ఆయన కనిపిస్తారు.
ఆయన పాత్ర పేరు వరదరాజు.. మిస్టర్ బి మీ ఖర్చులకి ఇచ్చేస్తాడు’ అంటూ ట్వీట్ చేశారు తరుణ్‌భాస్కర్. బుధవారం బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయన లుక్‌ని విడుదల చేశారు. ఈ ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.