సీఎం పెళ్లాం బయటకొస్తే?..
ఇంద్రజ, అజయ్, జయసుధ, సుమన్ ముఖ్య పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. గడ్డం రమణారెడ్డి దర్శకుడు. బొల్లా రామకృష్ణ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
ఇంద్రజ, అజయ్, జయసుధ, సుమన్ ముఖ్య పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. గడ్డం రమణారెడ్డి దర్శకుడు. బొల్లా రామకృష్ణ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘ ‘ఒకే ఒక్కడు’ సినిమాలో వన్డే సీఎంని చూశాం. ఈ సినిమాలో సీఎం పెళ్లాం బయటకు వస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. సామాజిక స్పృహతో కూడిన కథాంశమిది. వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది.’ అని తెలిపారు.
నవ్వించడంతోపాటు ఆలోచింపజేసే సినిమా ఇదని, రియల్ లైఫ్‌లో జరుగుతున్న సంఘటనలు ఈ సినిమాలో చూస్తారని, ఈ కంటెంట్ ఓరియెంట్ మూవీ అందరికీ నచ్చుతుందని ఇంద్రజ నమ్మకం వెలిబుచ్చారు. ఈ సినిమాలో నటించడం పట్ల నటుడు అజయ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. నగేష్, కోటేశ్వరరావు, భరత్, ప్రీతినిగం, రూపలక్ష్మీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: నాగశ్రీనివాసరెడ్డి, సంగీతం: ప్రిన్స్ హెన్రీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

