Naga Shaurya | నాగశౌర్య సినిమాలో టాప్ టెక్నీషియన్..!
Naga Shaurya Next Movie | టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి కథా బలమున్న సినిమాలను చేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Naga Shaurya Next Movie | టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి కథా బలమున్న సినిమాలను చేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ‘ఛలో’ మూవీ తర్వాత ఇప్పటివరకు నాగశౌర్యకు మరో హిట్టు లేదు. ఇక ఇటీవలే భారీ అంచనాల నడుమ రిలీజై ‘కృష్ణ వ్రింద విహారీ’ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్గానే మిగిలిపోయింది. రిలీజ్ రోజు ఈ సినిమా పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా, ఫైనల్‌గా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే నాగశౌర్య ఇటీవలే తన నెక్స్ట్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘NS24’గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అరుణాచలం దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. కాగా తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించింది. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వెట్రీ పలనిస్వామి ఛాయగ్రాహకుడిగా పనిచేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, అరుణ్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య గత చిత్రాలకంటే భిన్నంగా కనిపిస్తాడని చిత్రబృందం ఇటీవలే వెల్లడించింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరుగనున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Naga shaurya
- NS24
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

