Oppenheimer | వామ్మో.. ఆ సినిమా టికెట్ ధర అక్షరాల రూ.2450.. అయినా ఫస్ట్ వీకెండ్ సోల్డ్ అవుట్..!
Oppenheimer Movie Tickets | మరో మూడో రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఓపెన్ హైమర్ గురించి యావత్ ప్రపంచం మొత్తం అమితాసక్తితో ఎదురు చూస్తుంది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 21న రిలీజ్ కానుంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవగా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మాములుగా ఇక్కడ మల్టీప్లెక్స్ లో ఒక సినిమా ధర మూడొందలు ఉంటుంది.
Oppenheimer Movie Tickets | మరో మూడో రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఓపెన్ హైమర్ గురించి యావత్ ప్రపంచం అమితాసక్తితో ఎదురు చూస్తుంది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 21న రిలీజ్ కానుంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవగా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మాములుగా ఇక్కడ మల్టీప్లెక్స్ లో ఒక సినిమా ధర మూడొందలు ఉంటుంది. దానికి మనం అమ్మో అంత పెట్టి టిక్కెట్ కొనాలా అనుకుంటాం. అదే ఫ్యామిలీని వెంటబెట్టుకుని వెళ్తే పదిహేను వందల నుంచి రెండు వేలకు చిల్లు పడ్డట్లే. అలాంటిది ఏడొందల కిలోమీటర్ల అవతల ఉన్న ముంబైలో ఈ సినిమా టిక్కెట్టు ధర అక్షరాల రూ.2450. ఇంత రేటు పెట్టి ఎవరు చూస్తారు అనుకుంటే పప్పులే కాలేసినట్లే. ఎందుకంటే ఇప్పటికే వీకెండ్ వరకు టిక్కెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి.
ముంబైలోని పీవీఆర్ ఐమాక్స్ లో రెక్లైనర్ సీటు కోసం ఈ ధర నిర్ణయించారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే టిక్కెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. దీన్ని బట్టి చూస్తే క్రిస్టోఫర్ క్రేజ్ ఇండియాలో ఏ స్థాయిలో ఉందోనని తెలుస్తుంది. కేవలం ముంబై నగరంలోనే కాదు. బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో సైతం ఒక్కో టిక్కెట్ ధర వెయ్యికి పై మాటే. ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందంటే తొలిసారి ఒక హాలీవుడ్ సినిమాకు ఉదయం 3 గంటలకే బెన్ ఫిట్ షోలు పడేంత. ఇప్పటివరకు ఇండియాలో లక్షకు పైగానే టిక్కెట్లు తెగాయి. మూడు రోజులకు ముందే ఈ రేంజ్ లో సినిమాపై క్రేజ్ ఉందంటే.. రిలీజయ్యాక కాస్త పాజిటీవ్ టాక్ వచ్చిన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఓపన్ హైమర్ సినిమా సరికొత్త రికార్డులు కొల్లగొట్టడం ఖాయం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

