అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన చిత్రం ‘శుక్ర’. సుకు పూర్వజ్ దర్శకుడు. అయ్యన్ననాయుడు నల్ల, తేజ్ పల్లె నిర్మాతలు. ఈ సినిమాలోని ‘ఛోరా చకోరా..’ అనే గీతాన్ని ఇటీవల చిత్రబృందం విడుదలచేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘చాందినీ భతిజపై చిత్రీకరించిన ఈ ప్రత్యేక గీతానికి చక్కటి స్పందన లభిస్తోంది. పాట వచ్చే సందర్భం ఆసక్తికరంగా ఉంటుంది. మైండ్ గేమ్ ఆధారంగా సాగే క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఆశీర్వాద్.