ఆకాష్ పూరీ, గెహనా సిప్పీ జంటగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. ఐవీ ప్రొడక్షన్స్ సంస్థలో వీఎస్ రాజు నిర్మిస్తున్నారు. జీవన్ రెడ్డి దర్శకుడు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి జడ లిరికల్ సాంగ్‌ను శనివారం హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రామ్ మిర్యాల పాడారు. భాను కొరియోగ్రఫీలో సీనియర్ నటి అర్చన, ఆకాష్ పూరీ ఆడిపాడారు. నాయిక అందాన్ని వర్ణిస్తూ సాగుతుందీ పాట. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : జగదీశ్ చీకటి, ఎడిటింగ్ : అన్వర్ అలీ, ఆర్ట్ : గాంధీ నడికుడికర్.