Ponniyin Selvan Movie | ‘పొన్నియిన్ సెల్వన్’ సెకండ్ సింగిల్ గ్లింప్స్ విడుదల..!
Ponniyin Selvan Chola Chola Promo | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘పొన్నియిన్ సెల్వన్’ ఒకటి. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలుంటాయి. ప్రేమకథా చిత్రాలకే మణిరత్నం టేకింగ్ గాని, డీటేయిలింగ్ గాని ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటిది ఈ సారి ఏకంగా పీరియాడిక్ డ్రామా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడంటే ఇంకా ఏ స్థాయిలో తన టేకింగ్ ఉండనుందో అని ప్రేక్షకులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోని ‘చోళ చోళ’ అంటూ సాగే పాట ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇక ఇదివరకే చిత్రం నుండి విడుదలైన ‘దొంగ దొంగ’ పాటకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కనుంది. మొదటి భాగం సెప్టెంబర్ 30న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

