Thangalaan Movie | తంగలాన్ సినిమా షూటింగ్ పూర్తి.. విక్రమ్ ఎమోషనల్ పోస్ట్
Vikram Thangalaan | ఇటీవలే భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్-2(PS-2)తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఇందులో ఆదిత్య కరికాలన్ పాత్రలో అదిరిపోయే యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్ (Thangalaan).
ఇటీవలే భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఇందులో ఆదిత్య కరికాలన్ పాత్రలో అదిరిపోయే యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్ (Thangalaan). ఈ చిత్రానికి కబాలి (Kabali), కాలా (Kaala), సారాపట్టా పరంబరై (Sarpatta Parambarai) లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తీసిన పా.రంజిత్ (Pa. Ranjith) దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ పూర్తి (Shooting wrapped up) అయ్యింది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా షూటింగ్ స్పాట్ నుంచి హీరో విక్రమ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘అద్భుతమైన వ్యక్తులతో పని చేశా, చాలా అద్భుతమైన అనుభవాలను పొందాను. మొదటి ఫోటో (షూటింగ్ మొదలైన రోజు నుంచి) చివరి ఫోటో మధ్య కేవలం 118 రోజులు మాత్రమే ఉన్నాయా..! మమ్మల్ని ఈ డ్రీమ్‌లో జీవించేలా చేసినందుకు రంజిత్‌కి ధన్యవాదాలు అని’ విక్రమ్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. విక్రమ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది.
తమిళ్ అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పార్వతి, మాళవిక మోహనన్ నాయికలుగా నటిస్తున్నారు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, నీలం ప్రొడక్షన్స్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్ రాజా, పా.రంజిత్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
And it’s a wrap!! What a journey!! Worked with some of the most amazing people & had some of the most evocative experiences as an actor.
Was it just 118 working days between the first pic & the last.
Thank you Ranjit for making us live this dream. Every single day. #thangalaan pic.twitter.com/LijMehsZeF— Vikram (@chiyaan) July 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

