కన్నడ కంఠీరవ జయంతి… గుర్తు చేసుకున్న చిరంజీవి

కన్నడ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్నారు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్. 1954లో వచ్చిన బెదర కన్నప్ప సినిమా ద్వారా పూర్తి స్థాయి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రాజ్‌కుమార్ అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ఆయనకు కన్నడ నాటే కాదు దేశ వ్యాప్తంగా మంచి పేరుంది. రాజ్ కుమార్ కెరీర్ లో ఎన్నో గొప్ప సినిమాలున్నప్పటికీ, బంగారద మనుష్య (బంగారు మనిషి), కస్తూరి నివాస, గంధద గుడి, జీవన చైత్ర ఆయనకు మరింత పేరు తెచ్చిపెట్టాయి.
రాజ్ కుమార్ నటుడిగానే కాకుండా సింగర్‌గాను అలరించారు. 1954 నుంచి 2006 వరకు మొత్తంగా తన కెరీర్ లో 206 సినిమాలతో కన్నడ సినిమాను శ్వాసించి శాసించిన మహా నటుడు రాజ్ కుమార్. తన స్వంత సంస్థలైన వజ్రేశ్వరి కంబైన్స్, దాక్షాయణి కంబైన్స్ బ్యానర్ల పై 100వ సినిమా భాగ్యదా బాగీలు, అలానే 200వ సినిమా దేవతా మనుష్య సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్నారు రాజ్ కుమార్.ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. పద్మ భూషణ్, కర్ణాటక రత్న, దాదా సాహెబ్ ఫాల్కే, కెంటకీ కల్నేల్ ఇలా ఎన్నో అవార్డులు దక్కించుకున్నారు. 2006, ఏప్రిల్ 12న రాజ్ కుమార్ అందరిని విడిచి అనంతలోకాలకేగారు. నేడు ఆయన 91వ జయంతి కావడంతో పలువురు అభిమానులు, ప్రేక్షకులు ఆయనను స్మరించుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్లో రాజ్‌కుమార్‌తో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. గొప్పతనం ఆయన సింప్లిసిటీలో ఉంటుంది. అన్నావరు మాటలు,ఆయన పనులు చూసి ఎంతో నేర్చుకున్నాను. నా జీవితంపై ఆయన ప్రభావం ఎంతో ఉంది. డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా నిజమైన బంగారద మనుష్య (బంగారు మనిషి)ను గుర్తు చేసుకుంటున్నాను అని చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arvind Kejriwal: 7 కోట్లు ఇవ్వండి.. కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు
మోటకొండూర్ మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం
Jagga Reddy | సోనియాగాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా : జగ్గారెడ్డి
Kiara Advani | ‘టాక్సిక్’ రిజల్ట్ నన్ను కుంగదీసింది : కియారా అద్వానీ
Pat Cummins: క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌తో సిడ్నీ వీధిలోనే గొడవపడ్డ భార్య.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

