Satyanand | నిత్య సినీ విద్యార్ధి.. రైటర్ సత్యానంద్‌కు చిరంజీవి శుభాకాంక్షలు.. ట్రెండింగ్‌లో త్రోబ్యాక్ స్టిల్స్
Writer Satyanand | పాపులర్ డైలాగ్, స్క్రిప్ట్ రైటర్ సత్యానంద్ రచయితగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో విజయవంతంగా 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు సత్యానంద్ (Satyanand). మెమొరబుల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా సత్యానంద్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భావోద్వేగ సందేశాన్ని అందరితో పంచుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).
Writer Satyanand | పాపులర్ డైలాగ్, స్క్రిప్ట్ రైటర్ సత్యానంద్ రచయితగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో విజయవంతంగా 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు సత్యానంద్ (Satyanand). 1973లో సూపర్ స్టార్ కృష్ణ ఐకానిక్ సినిమా ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేసిన మాయదారి మల్లిగాడుతో అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ రైటర్‌గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు సత్యానంద్. సత్యానంద్ మెమొరబుల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. బావోద్వేగ సందేశాన్ని అందరితో పంచుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).
ప్రియ మిత్రులు.. నాకు అత్యంత ఆప్తులు, మృదు భాషి , సౌమ్యులు, సత్యానంద్ తన సినీ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు నా హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు. ఆయనతో నా వ్యక్తిగత అనుబంధం, నేను నటించిన చాలా చిత్రాల్లో ఆయన పోషించిన పాత్ర ఎంతో ప్రగాఢమైనది.
ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్‌గా వుంటూ , ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటార్‌గా, గైడింగ్ ఫోర్స్‌గా, గొప్ప సపోర్ట్ సిస్టమ్‌గా వుంటూ.. సినిమాను ప్రేమిస్తూ , సినిమానే ఆస్వాదిస్తూ , సినిమాని తన జీవన విధానం గా మలచుకున్న నిత్య సినీవిద్యార్ధి, తరతరాల సినీ ప్రముఖులoదరికీ..మీరిలాగే మీ సినీ పరిజ్ఞానాన్ని , సినీ ప్రేమని, అందరికీ పంచుతూ, మరెన్నో చిత్రాల విజయాలకు సంధాన కర్తగా, మరో అర్ధ శతాబ్దంపాటు ఇంతే ఎనర్జీతో ఉండాలని ఆశిస్తున్నానని సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశారు.
తన సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి సత్యానంద్‌తో దిగిన ఫొటోతోపాటు మరో స్టిల్‌ను ట్వీట్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడీ త్రోబ్యాక్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరంజీవి నటించిన కొండవీటి సింహం, అభిలాష, యముడికి మొగుడుతోపాటు పలు చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు. పవన్ కల్యాణ్ నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రానికి కూడా పనిచేశారు.
ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి
స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్ గా వుంటూ , ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటోర్ గా,ఒక గైడింగ్ ఫోర్స్ గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్ గా వుంటూ , సినిమాని ప్రేమిస్తూ , సినిమానే… pic.twitter.com/Tc7aphFOD2— Chiranjeevi Konidela (@KChiruTweets) October 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

