MEGA 156 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ (Vasistha) దర్శకత్వంలో సినిమా ప్రకటించాడని తెలిసిందే. అయితే ఇప్పటివరకు MEGA 157గా వార్తల్లో నిలిచిన ఈ ప్రాజెక్ట్ ఇక నుంచి MEGA 156గా మారింది. దసరా శుభాకాంక్షలతో ఈ మూవీని పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంఛ్ చేశారు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, డైరెక్టర్ వశిష్ఠ, చంద్రబోస్, నిర్మాతలతోపాటు డైరెక్టర్లు వివి వినాయక్, మారుతి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఓపెనింగ్ డేన మ్యూజికి సిట్టింగ్ పనులు కూడా మొదలయ్యాయి. స్టూడియోలో కీరవాణి, చంద్రబోస్ మ్యూజిక్ సిట్టింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఆరు పాటలుంటాయన్నారు ఎంఎం కీరవాణి. ఈ మూవీ నుంచి ఇప్పటికే కాన్సెప్ట్ పోస్టర్ లాంఛ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని చాలా రోజుల క్రితమే అప్డేట్ అందించారు.
మీ అందరికీ సినిమాటిక్ అడ్వెంచర్‌ను అందించడానికి మేమంతా సిద్దం.. అంటూ డైరెక్టర్ వశిష్ఠ సినిమా అనౌన్స్మెంట్ నుంచి సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. ఈ మూవీని లీడింగ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. మెగా 156 చిత్రానికి చోటా కే నాయుడు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ..కాగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
చిరంజీవి మరోవైపు బంగార్రాజు ఫేం కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడని తెలిసిందే. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం చిరంజీవి కూతురు సుస్మిత హోంబ్యానర్లో చేస్తున్న మరో సినిమాకు MEGA 156 వర్కింగ్ టైటిల్ పెట్టగా.. ఈ టైటిల్ కాస్తా వశిష్ఠ మూవీకి మారింది. ఈ నేపథ్యంలో సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్లో చిరు చేయబోతున్న సినిమాకు MEGA 157పేరు ప్రచారంలోకి రానుందని తెలుస్తోంది.
#Mega156 launched in a Grand Pooja Ceremony with the entire cast & crew attending and offering their prayers 💫
MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @NaiduChota @saimadhav_burra @UV_Creationspic.twitter.com/KO6RREiDOp
— Suresh PRO (@SureshPRO_) October 24, 2023
#Mega156
Beginning the MEGA MASS BEYOND UNIVERSE with a celebratory song composition followed by an auspicious Pooja Ceremony ❤️MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @NaiduChota @saimadhav_burra @UV_Creations pic.twitter.com/aLdSalPbSM
— Suresh PRO (@SureshPRO_) October 24, 2023
MEGA 156 ప్రీ ప్రొడక్షన్ షురూ..
The Pre-production for #Mega157 begins with a bang ❤🔥
Brace yourselves for a MEGA MASS BEYOND UNIVERSE ♾️
MEGASTAR @KChiruTweets @DirVassishta @NaiduChota @UV_Creations pic.twitter.com/d488SxjxOn
— UV Creations (@UV_Creations) September 10, 2023
MEGA 156 కాన్సెప్ట్ పోస్టర్..
My heartfelt thanks to the MIGHTY MEGASTAR @KChiruTweets garu for believing me and giving me the chance to present you on BIG screens🙏🏻
Wishing the BOSS of Masses a very happy birthday!🌟
Here’s the concept poster of #MEGA157 – MEGA MASS BEYOND UNIVERSE 🔥
More details soon!… pic.twitter.com/oA0rg3g5Zn
— Vassishta (@DirVassishta) August 22, 2023