MEGA 157 | చిరంజీవి ఫ్యాన్స్ రెడీ.. మెగా 157పై స్టన్నింగ్ అప్డేట్
MEGA 157 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చిరంజీవి MEGA 157కు సంబంధించిన అధికారిక వార్త ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. సోషియా ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది చిరంజీవి టీం.
MEGA 157 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. MEGA 157కు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. సోషియా ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది చిరంజీవి టీం. మెగా సినిమాకు మెగా ఆరంభం. మెగా 157 ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.
మీ అందరికీ సినిమాటిక్ అడ్వెంచర్‌ను అందించడానికి మేమంతా సిద్దం అంటూ చిరంజీవి అండ్ టీంతో దిగిన ఫొటోను షేర్ చేశాడు డైరెక్టర్ వశిష్ఠ. ఇప్పుడీ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని లీడింగ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి చోటా కే నాయుడు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ. వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే లాంఛ్ చేసిన మెగా 157 కాన్సెప్ట్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
చిరంజీవి దీంతోపాటు బంగార్రాజు ఫేం కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna Kurusala) డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్లో ఈ సినిమా రాబోతుంది. మలయాళ సూపర్ హిట్ ప్రాజెక్ట్ బ్రో డాడీ (BRO Daddy)కి రీమేక్‌గా ఈ ప్రాజెక్ట్ రాబోతుందని ఇండస్ట్రీ సర్కిల్ సమాచారం. లీడ్ రోల్లో చిరంజీవి కనిపించనుండగా.. మరో పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నాడంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై రాబోయే రోజుల్లో టీం నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
MEGA 157 ప్రీ ప్రొడక్షన్ షురూ..
The Pre-production for #Mega157 begins with a bang ❤🔥
Brace yourselves for a MEGA MASS BEYOND UNIVERSE ♾️
MEGASTAR @KChiruTweets @DirVassishta @NaiduChota @UV_Creations pic.twitter.com/d488SxjxOn
— UV Creations (@UV_Creations) September 10, 2023
MEGA 157 కాన్సెప్ట్ పోస్టర్..
My heartfelt thanks to the MIGHTY MEGASTAR @KChiruTweets garu for believing me and giving me the chance to present you on BIG screens🙏🏻
Wishing the BOSS of Masses a very happy birthday!🌟
Here’s the concept poster of #MEGA157 – MEGA MASS BEYOND UNIVERSE 🔥
More details soon!… pic.twitter.com/oA0rg3g5Zn
— Vassishta (@DirVassishta) August 22, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

