Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నూతన సంవత్సరంలో కొత్త సినిమాతో అలరించేందుకు రెడీ అంటున్నాడు. వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమాతో 2023లో బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టేందుకు సిద్దమవుతుంది చిరంజీవి టీం. న్యూ ఇయర్ సందర్భంగా చిత్రయూనిట్ సభ్యుల కోసం పార్టీ ఏర్పాటు చేశాడు చిరంజీవి.
డైరెక్టర్ బాబీతోపాటు నిర్మాతలు రవిశంకర్, నవీన్ యేర్నేని, శేఖర్ మాస్టర్, రామ్-లక్ష్మణ్, రవితేజ, వెన్నెల కిశోర్తోపాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల బృందానికి పార్టీ ఇచ్చాడు చిరు. వాల్తేరు వీరయ్య టీం కోసం పార్టీ ఇక్కడ.. అంటూ పార్టీ మూడ్లో ఉన్నపుడు ఛిల్ అవుట్ అవుతూ టీంతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు చిరంజీవి. ఈ స్టిల్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
వాల్తేరు వీరయ్య సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. అత్యంత భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్యలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా బాస్ పార్టీ సాంగ్లో మెరవనుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు మూవీ అండ్ మ్యూజిక్ లవర్స్ లో ఫుల్ జోష్ నింపుతున్నాయి.
వాల్తేరు వీరయ్య టీంతో సెలబ్రేషన్స్..
Here’s the Party 🎉
For Team #WaltairVeerayya pic.twitter.com/EPja5UvOJ4
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 2, 2023
వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ..
వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్..
బాస్ పార్టీ లిరికల్ వీడియో సాంగ్..