హాలీవుడ్ ‘యూనివర్స్’ సంస్కృతి నిదానంగా భారతీయ సినిమాను కూడా ఆవహిస్తున్నది. ఓ గొలుసుకట్టులా కథకూ కథకూ లింకులిస్తూ, క్యారెక్టర్లను కలుపుతూ ఓ గమ్మత్తైన ప్రపంచాన్ని సృష్టించేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు నేటి దర్శకులు. కార్తీ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ చిత్రం దక్షిణాదిన ఈ ధోరణికి నాంది పలికింది. ఇప్పుడైతే ఈ ధోరణి సర్వసాధారణం. ప్రస్తుతం నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన చిరంజీవితో సినిమా చేయబోతున్నారు. విశేషమేమిటంటే.. ‘ది ప్యారడైజ్’ కథకూ, చిరంజీవితో చేయబోయే కథకు ఒక బలమైన లింక్ ఉంటుందట. ఈ లింక్ ‘ప్యారడైజ్’ ైక్లెమాక్స్‌లో రివీల్ అవుతుందట.
చిరంజీవి ఈ సినిమాలో నేరుగా కనిపించకపోయినా.. ఆయన పాత్రకు సంబంధించిన బలమైన లీడ్ మాత్రం ‘ప్యారడైజ్’ ముగింపులో ఉంటుందని తెలుస్తున్నది. ఓ విధంగా ‘ది ప్యారడైజ్’కి ప్రీక్వెల్‌గా చిరంజీవి సినిమా ఉంటుందని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రక్తపాతాన్ని కూడా ైస్టెలిష్‌గా చూపించడం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రత్యేకత. నాని ‘ప్యారడైజ్’లో పాత్రలు, సంభాషణలు చాలా బోల్డ్‌గా ఉంటాయని ప్రచార చిత్రాలు చెబుతున్నాయి. ఈ బోల్డ్నెస్, ఈ వయొలెంట్ ఎఫెక్ట్ చిరంజీవి సినిమాలోనూ కంటిన్యూ అవుతుందని తెలుస్తున్నది. మరి ఈ వార్తలో నిజం ఎంతవుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.