MEGA 157 | షెడ్యూల్ కంటే ముందే సెట్స్‌పైకి చిరంజీవి మెగా 157..!
MEGA 157 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా MEGA 157. సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాపై ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని అప్డేట్ కూడా వచ్చేసింది.
MEGA 157 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో నటిస్తోన్న MEGA 157. ఈ మూవీ నుంచి ఇప్పటికే కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాపై ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని అప్డేట్ కూడా వచ్చేసింది. ఈ మూవీ 2024 ప్రథమార్థంలో సెట్స్‌పైకి వెళ్లనుందని ముందుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తాజా టాక్ ప్రకారం అనుకున్న టైం కంటే ముందుగానే సెట్స్‌పైకి వెళ్లనుందట. మెగా 157 టీం నవంబర్‌లో చిత్రీకరణ మొదలుపెట్టబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే వీలైనంత త్వరలోనే చిరంజీవి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నమాట. మీ అందరికీ సినిమాటిక్ అడ్వెంచర్‌ను అందించడానికి మేమంతా సిద్దం.. అంటూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు డైరెక్టర్ వశిష్ఠ. ఈ మూవీని లీడింగ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. మెగా 157 చిత్రానికి చోటా కే నాయుడు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్‌ను హీరోయిన్గా తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
చిరంజీవి మరోవైపు బంగార్రాజు ఫేం కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమాకు సంతకం చేశాడని తెలిసిందే. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్లో ఈ సినిమా తెరకెక్కనుంది. మలయాళ సూపర్ హిట్ ప్రాజెక్ట్ బ్రో డాడీ (BRO Daddy)కి రీమేక్‌గా ఈ ప్రాజెక్ట్ రాబోతుందని సమాచారం.
MEGA 157 ప్రీ ప్రొడక్షన్ షురూ..
The Pre-production for #Mega157 begins with a bang ❤🔥
Brace yourselves for a MEGA MASS BEYOND UNIVERSE ♾️
MEGASTAR @KChiruTweets @DirVassishta @NaiduChota @UV_Creations pic.twitter.com/d488SxjxOn
— UV Creations (@UV_Creations) September 10, 2023
MEGA 157 కాన్సెప్ట్ పోస్టర్..
My heartfelt thanks to the MIGHTY MEGASTAR @KChiruTweets garu for believing me and giving me the chance to present you on BIG screens🙏🏻
Wishing the BOSS of Masses a very happy birthday!🌟
Here’s the concept poster of #MEGA157 – MEGA MASS BEYOND UNIVERSE 🔥
More details soon!… pic.twitter.com/oA0rg3g5Zn
— Vassishta (@DirVassishta) August 22, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

