తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర
తెలుగు సినీ జర్నలిస్టులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సీనియర్ సినీ జర్నలిస్టు వినాయక రావు రచించిన ‘తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’ పుస్తకాన్ని శనివారం అగ్ర నటుడు చిరంజీవి తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నా కెరీర్ ఆరంభం నుంచి సినీ రచయితలు, జర్నలిస్టులతో గొప్ప అనుబంధాన్ని కొనసాగిస్తున్నా.
తెలుగు సినీ జర్నలిస్టులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సీనియర్ సినీ జర్నలిస్టు వినాయక రావు రచించిన ‘తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’ పుస్తకాన్ని శనివారం అగ్ర నటుడు చిరంజీవి తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నా కెరీర్ ఆరంభం నుంచి సినీ రచయితలు, జర్నలిస్టులతో గొప్ప అనుబంధాన్ని కొనసాగిస్తున్నా. వారికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. నా తప్పులను ఎత్తిచూపి నేను సరిదిద్దుకునేందుకు ప్రేరణ కలిగించిన గుడిపూడి శ్రీహరి వంటి జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారు.
కలం సైనికులైనటువంటి జర్నలిస్టులు వాస్తవాలను ప్రతిబింబించే వార్తలను రాసినప్పుడు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. వినాయక రావు ఏ పుస్తకాన్ని రాసినా లోతైన విశ్లేషణ చేస్తారు. అరుదైన ఫొటోలను సేకరిస్తుంటారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఆయన చేస్తున్న ప్రయత్నం అభినందనీయం’ అన్నారు. తాను రాసిన పన్నెండవ పుస్తకం ఇదని, టాకీ కాలం నుంచి నేటి సినీ జర్నలిస్టుల వరకు సమగ్ర సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచానని రచయిత వినాయక రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ప్రభు, రెంటాల జయదేవతో పాటు పలువురు సినీ జర్నలిస్టులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

