Chiranjeevi | ‘గాడ్‌ఫాదర్’ విడుదల తేదీ కన్సార్మ్ అయిందా?.. ఆ యువ హీరోలకు చిరంజీవి పోటీగా రానున్నాడా?
Chiranjeevi God Father Movie | చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ యువ హీరోలకు పోటీనిస్తున్నాడు. అప్పట్లో చిరంజీవికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ప్రస్తుతం ఈయన నటస్తున్న మూడు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. ఇటీవలే ఈయన నటించిన ‘ఆచార్య’ విడుదలై ఫ్లాప్‌గా నిలిచింది. ఈ క్రమంలో చిరు తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం ఈయన మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాను చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసీఫర్’కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. అన్ని కుదిరితే ఆగస్టులోనే విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. స్వతంత్ర దినోత్సవం కానుకగా మేకర్స్ ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే అదే రోజున అమీర్‌ఖాన్- నాగ చైతన్య ‘లాల్‌సింగ్ చద్ధా’, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’, సమంత ‘యశోదా’తో పాటు అఖిల్ ‘ఏజెంట్’ కూడా విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. గాడ్‌ఫాదర్ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ డెరెక్టర్ పూరి జగన్నాధ్, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి, ప్రసాద్ ఎన్వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

