Chiranjeevi | క్రేజీ న్యూస్.. బంగార్రాజు డైరెక్టర్‌తో చిరంజీవి సినిమా..!
Chiranjeevi | బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna Kurusala) కొత్త సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Chiranjeevi | సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలతో డైరెక్టర్‌గా మంచి బ్రేక్ అందుకున్నాడు యువ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna Kurusala). ఈ యువ దర్శకుడి కొత్త సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో కళ్యాణ్ కృష్ణ సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే చిరంజీవితో చేయబోయే సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథనందిస్తుండగా.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడని ఇన్సైడ్ టాక్.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్‌లో కొనసాగుతున్నాయని ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ముందుగా వచ్చిన అప్డేట్ ప్రకారం చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్‌పై ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన త్వరలోనే ఉండబోతుందట. ఇదిలా ఉంటే చిరంజీవి బింబిసార డైరెక్టర్ వశిష్టతో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
కళ్యాణ్ కృష్ణ తో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత వశిష్ఠ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చిరంజీవి ఆలోచిస్తున్నట్టు సమాచారం. కథానుగుణంగా విస్తృతమైన పనుల కారణంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కు ఎక్కువ సమయం పట్టనుండటంతో.. ప్రస్తుతం దానిపైనే వశిష్ట ఫోకస్ పెట్టినట్టు టాక్. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేశ్ డైరెక్షన్లో భోళాశంకర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

