అగ్ర కథానాయకుడు చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా వేదికగా పోస్ట్ చేసిన ఓ ఆడియో ఫైల్ హాట్‌టాపిక్‌గా మారింది. ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటూ చిరంజీవి చెప్పిన మాటలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ డైలాగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’కు సంబంధించినదా? లేదా రాజకీయ కోణంలోనే ఆ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ మొదలైంది. ఆడియో ఫైల్‌పై గాడ్‌ఫాదర్ స్టిల్ ఉండటంతో ఖచ్చితంగా అది సినిమాలోని ఓ డైలాగ్ మాత్రమే అంటున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలకానుంది. ఇదిలావుండగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా తాలూకు కొత్త షెడ్యూల్ మంగళవారం నుంచి రాజమండ్రిలో మొదలైంది. ఇందులో రవితేజ కూడా పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది.