Chiranjeevi-Bobby Movie | చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ యువ హీరోలకు పోటీనిస్తున్నాడు. అప్పట్లో చిరంజీవికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే చిరు ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో చిరు తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం చిరు రెండు సినిమా షూటింగ్‌లను ఏకకాలంలో జరుపుతున్నాడు. అందులో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’ ఒకటి. తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. కాగా ఇప్పటికే సంక్రాంతి రేసులో ప్రభాస్ ‘ఆదిపురుష్’, రామ్‌చరణ్-శంకర్ సినిమాలు ఉన్నాయి. ఈ సారి మెగాస్టార్ కూడా యాడ్ అయ్యాడు. ఇదే జరిగితే తండ్రి, కొడుకులు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నట్లే. మెగాస్టార్ 154వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ‘ముఠా మేస్త్రీ’ తరహా మాస్ యాంగిల్లో ఉండనున్నట్లు గతంలో విడుదలైన పోస్టర్లను చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రంలో చిరు అండర్‌కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మాస్రాజ రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నారు.
This time its going to be a MEGA festival!🤩
Make way for MASS MOOLA VIRAT for this Sankranthi 2023🌟
Can’t hold my eagerness to witness the MASS Euphoria of MY HERO @KChiruTweets garu on the big screens with my film #Mega154😊
Kaluddam Sankranthi ki😎#Mega154ForSankranthi 💥 pic.twitter.com/2tVoBxqvYm
— Bobby (@dirbobby) June 24, 2022