Johnny Master | జానీ మాస్టర్‌పై చిన్మయి సంచలన ఆరోపణలు .. మైనర్ కేసులో తప్పించుకోవడానికి ప్రయత్నం ..
Johnny Master | సినీ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్తగా పేరుగాంచిన చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) మరోసారి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
Johnny Master | సినీ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్తగా పేరుగాంచిన చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) మరోసారి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ తన పరిచయాలు, సినీ ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టిన చిన్మయి.. ఈ కేసు ఎంతో క్లిష్టమైనదని, కొందరు దీన్ని “ఇద్దరి సమ్మతితో జరిగిన అంశం”గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఒక మేజర్ వ్యక్తి మైనర్ బాలికను లోబరుచుకున్నప్పుడు, అది తప్పక మేజర్ వ్యక్తి బాధ్యతే అవుతుంది. బాధితురాలు సహకరించనప్పుడు బెదిరించి లొంగదీసుకోవడం మరింత దారుణం అని చిన్మయి పేర్కొన్నారు. అలాగే తాను ప్రతి సారి ఈ విషయంపై మాట్లాడినప్పుడు జానీ మాస్టర్ భార్య ఫోన్ చేసి మాట్లాడవద్దని చెబుతోందని కూడా ఆమె వెల్లడించారు. చిన్మయి తన పోస్టులో, జానీ మాస్టర్ కుటుంబం తమ నిర్దోషిత్వాన్ని నిరూపించే ఆధారాలు ఉన్నాయని చెబుతోందని పేర్కొంటూ, ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడి కారణంగా జానీ మాస్టర్ ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు.
ఒకవేళ కోర్టు తీర్పు వారికి అనుకూలంగా వస్తే, ఇక అవార్డుల మీద అవార్డులు వస్తాయి. అతన్ని విమర్శించిన వారే అతని ‘నిర్దోషిత్వం’ గురించి గొప్పగా మాట్లాడతారు అని ఎద్దేవా చేశారు. మైనర్ బాలికలతో శృంగారాన్ని థ్రిల్‌గా భావించే మహానుభావులకు ఇది ఒక పాఠంలా మారుతుంది. తర్వాత వాళ్లు ఎలా తప్పించుకోవాలో కూడా నేర్చుకుంటారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ బాధితురాలు ధైర్యంగా పోరాడి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిందితుడికి శిక్ష పడి, ఆమెకు న్యాయం జరగాలని మాత్రమే ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. జానీ మాస్టర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

