‘ధూం ధాం’ అనిపించే వినోదం
“ధూం ధాం’ సినిమాలో ఎలాంటి కష్టాలు, కన్నీళ్లు ఉండవు. వందశాతం వినోదంతో ఆకట్టుకుంటుంది. ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది’ అన్నారు చేతన్‌కృష్ణ. ఆయన కథానాయకుడిగా సాయికిషోర్ మచ్చా దర్శకత్వంలో ఎంఎస్ రామ్‌కుమార్ నిర్మించిన ‘ధూం ధాం’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
“ధూం ధాం’ సినిమాలో ఎలాంటి కష్టాలు, కన్నీళ్లు ఉండవు. వందశాతం వినోదంతో ఆకట్టుకుంటుంది. ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది’ అన్నారు చేతన్‌కృష్ణ. ఆయన కథానాయకుడిగా సాయికిషోర్ మచ్చా దర్శకత్వంలో ఎంఎస్ రామ్‌కుమార్ నిర్మించిన ‘ధూం ధాం’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చేతన్‌కృష్ణ మాట్లాడుతూ.. రెండున్నర గంటలపాటు కడుపుబ్బా నవ్వించే చిత్రమిదని, హీరోగా బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచానని చెప్పారు.
చక్కటి ప్రేమకథతో పాటు, ఆద్యంతం హాస్యంతో సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని దర్శకుడు సాయికిషోర్ మచ్చా తెలిపారు. నిర్మాత రామ్‌కుమార్ మాట్లాడుతూ ‘మా అబ్బాయి చేతన్‌కృష్ణ కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన చిత్రం. ఏ విషయంలోనూ రాజీపడకుండా తీశాం. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని పంపిణీ చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. హెబ్బాపటేల్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్నందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

