Chennai Love Story | చెన్నై లవ్ స్టోరీ ఓటీటీలోకి వచ్చేసింది.. కిరణ్ కెరీర్లో హైయెస్ట్ వసూళ్లు అందుకున్న సినిమా ఎందులో స్ట్రీమింగ్ అంటే..!
Chennai Love Story | టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా తెరకెక్కిన తాజా ప్రేమకథా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు రవి నంబురి తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, రచయిత సాయి రాజేష్ కథ అందించారు. విభిన్నమైన ప్రేమకథ, ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
Chennai Love Story | టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా తెరకెక్కిన తాజా ప్రేమకథా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు రవి నంబురి తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, రచయిత సాయి రాజేష్ కథ అందించారు. విభిన్నమైన ప్రేమకథ, ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక థియేటర్లలో మంచి విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు నేటి నుంచి ఈ సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర ప్రాంతాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఓటీటీ ద్వారా ఈ ప్రేమకథను ఆస్వాదించే అవకాశం దక్కింది. కిరణ్ అబ్బవరం కెరీర్లో ఈ సినిమా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆయన నటనతో పాటు శ్రీ గౌరీ ప్రియతో కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రేమ, భావోద్వేగాలు, సంబంధాల చుట్టూ సాగే ఈ కథ యువ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని చెప్పవచ్చు. థియేట్రికల్ రన్లో మంచి స్పందన రావడంతో సినిమా వసూళ్ల పరంగా కూడా అదిరిపోయే ఫలితాన్ని సాధించింది.
ఈ చిత్రానికి సంగీత దిగ్గజం మణిశర్మ సంగీతం అందించడం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రేమకథకు తగ్గట్టుగా ఆయన అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చాయి. భావోద్వేగ సన్నివేశాల్లో మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.సాయి రాజేష్, ఎస్కేఎన్ నిర్మాణం వహించిన ‘చెన్నై లవ్ స్టోరీ’, థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, మంచి ప్రేమకథను చూడాలనుకునేవారు ఇప్పుడు సోనీ లివ్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

