స్వయంకృషి, స్వీయ ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వచ్చిన చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డులు సృష్టించారు. సినీ కెరీర్లో 151 నాటౌట్‌గా ఉన్న చిరు యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. తన తనయుడితో కలిసి రీసెంట్గా ఆచార్య అనే చిత్రం చేశారు చిరు. కొరటాల శివ ఈ చిత్రాన్ని సామాజిక నేపథ్యంలో తెరకెక్కించారు. రామ్ చరణ్, చిరంజీవికి సంబంధించి పలు పోస్టర్స్ విడుదల కాగా, ఇవి ప్రేక్షకులకి ఎంతో ఆనందాన్ని కలిగించాయి.
అయితే చిరంజీవి బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ తన తండ్రితో కలిసి సెట్లో గడిపిన సందర్భాలకు సంబంధించి స్పెషల్ వీడియో విడుదల చేశారు. షూట్ కోసం మెగాస్టార్‌ని తన కారులో స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకెళుతున్న రామ్ చరణ్ ఆ తర్వాత సెట్లో తండ్రితో కలిసి సందడి చేశాడు. ఆయనని చూసి చాలా నేర్చుకున్నానని చెప్పిన రామ్ చరణ్ తన తండ్రికి ప్రేమ పూర్వక బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆచార్య సినిమాలో చరణ్- చిరు ఇద్దరు నక్సలైట్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక టీజర్లో మెగాస్టార్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు బహుశా గుణపాఠాలు చెప్తాననేమో..’ అంటూ చిరు చెప్పిన డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక ఆచార్యలో రామ్ చరణ్ సిద్ద అనే పాత్రలో కనిపించనున్నాడు. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజాహెగ్డే కనిపించనుంది.